ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలంలో ఉగ్ర స్తంభం సమీపంలో ఓ చెట్టుకు రెండు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయని పోలీసులు వెల్లడించారు. గైడ్ గా వెళ్తున్న వ్యక్తులు మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఏడాది మార్చి 21న అహోబిలంకు వచ్చి అదృశ్యమైన ప్రొద్దుటూరుకు చెందిన నరసింహుడు, నీలిమ మృతదేహాలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement