ఆలూరు: ఆలూరు మంత్రి క్యాంప్ కార్యాలయం అర్హత కలిగిన నూతన పింఛన్లు అవ్వ తాతలకు మంగళవారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం లబ్ధిదారులకు నూతన పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడలేని విధంగా అవినీతికి తావు లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్క అవ్వ తాతలకు వాలంటీర్ ద్వారా నేరుగా ఇంటి వద్దకే వెళ్లి పారదర్శకంగా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆలూరు మండలంలోని నూతన పింఛన్లు 312 మంది అవ్వ తాతలకు పింఛన్లు ఇవ్వడం జరిగిందన్నారు. ఆలూరు మండల కేంద్రంలోనే 81 పెన్షన్లు మంజూరయ్యాయి. అర్హత ఉండి పింఛన్లు రానివారు ఉంటే వాలంటీర్ నేరుగా సచివాలయ కార్యాలయంకి వెళ్లి దరఖాస్తు చేసి… పైసా అవినీతి లేకుండా సేవలందిస్తారన్నారు. పెన్షన్ లబ్ధిపొందిన అవ్వ తాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement