తుగ్గలి : మండల పరిధిలోని జొన్నగిరి గ్రామంలోని మాల వీధిలో శుక్రవారం పెళ్లిలో విషాదం చోటు చేసుకుంది. మాల వీధిలో పెళ్లి జరిగే సమయంలో వర్షం రావడంతో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని నీలావతి (29) అనే మహిళ పట్టుకోవడంతో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే సృహ తప్పి పడిపోయింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం జిల్లా గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆ మహిళ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు .ఈ విషయంపై జొన్నగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పెళ్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన నీలావతికి భర్త రాజు, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement