కర్నూల్ ప్రతినిధి : కర్నూల్ ట్రాఫిక్ విభాగం పోలీసుల ఆధ్వర్యంలో కర్నూలు నగరంలోని రాజ్ విహార్ సెంటర్ లో ట్రాఫిక్ మిత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ హాజరై ట్రాఫిక్ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొదటి సారిగా కర్నూలు జిల్లా ట్రాఫిక్ పోలీసు విభాగం వారు ట్రాఫిక్ మిత్ర కార్యక్రమంను ఏర్పాటు చేశారన్నారు. ట్రాఫిక్ మిత్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం జిల్లా ప్రజలను, పౌరులను పోలీసు సేవలలో భాగస్వామ్యం చేయడమే అన్నారు. కర్నూలు ప్రజలు, యువత కర్నూలు పోలీసు వెబ్ సైట్ కు వెళ్ళి మంచి సేవలందించే భావంతో పని చేయాలన్నారు. ఏక్కడైనా కళ్ళముందు వాహనదారులు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లయితే ఫోటో తీసి http://kurnoolpolice.in/trafficmitra/ ను క్లిక్ చేసి అందులో అప్ లోడ్ చేయాలన్నారు. ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడినట్లు పంపించిన ఫోటోలు, విడియోల ను కర్నూలు ట్రాఫిక్ పోలీసు విభాగం వారు విచారణ , నిర్ధారణ చేసి చలనా విధిస్తారన్నారు. ప్రతి ఒక్క పౌరుడు పోలీసు అవుతారన్నారు. కర్నూలు ట్రాఫిక్ క్రమబద్దీకరణపై ప్రజల సౌకార్యర్థం ఏవిధంగా సేవలందించాలనే ఆలోచనలు, సలహాలను కూడా పోలీసు వెబ్ సైట్ లో తెలియజేస్తే ఆ దిశ గా పని చేసే విధంగా చేస్తామన్నారు. కర్నూలు ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో 70 మందికి పైగా ఉంటారన్నారు. కర్నూలు జనభా 7 లక్షల దాకా ఉండవచ్చన్నారు. కర్నూలు ట్రాఫిక్ పోలీసులు ప్రతి చోట ఉండి విధులు నిర్వహించడం కష్టమన్నారు. ప్రజలు, యువత కూడా సహాకారం అందించాలన్నారు. అందరూ కూడా కళాశాలల్లో, పాఠశాలలో విద్యార్థులకు కూడా ఈ ట్రాఫిక్ మిత్ర కార్యక్రమం గురించి తెలియజేయాలన్నారు. కర్నూలులో ట్రాఫిక్ క్రమబద్దీకరణకు, ట్రాఫిక్ నిబంధనలు కట్టు దిట్టంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ప్రజలు సైతం కర్నూలు పోలీసు వెబ్ సైట్ లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను నమోదు చేసే విధంగా, మంచి సేవలందించే విధంగా పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. పోలీసు వెబ్ సైట్ ప్రారంభం జరిగిన తర్వాత ఇప్పటికే 532 ఫిర్యాదులు వచ్చాయన్నారు. విచారణ చేసి 76 మంది పై రూ. 37 వేల 553 రూపాయల జరిమానా విధించామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటాద్రి, ట్రాఫిక్ డిఎస్పీ నాగభూషణం, కర్నూలు పట్టణ డిఎస్పీ కెవి మహేష్, సిఐలు శ్రీనివాసులు, అబ్దుల్ గౌస్, రమణ, ఆర్ ఎస్సైలు, ఎఎస్సైలు, ట్రాఫిక్ కానిస్టేబుళ్ళు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement