Friday, November 22, 2024

కర్నూలు జిల్లాలో అతిసార క‌ల్లోలం – ముగ్గురు మృతి

క‌ర్నూలు జిల్లాలో క‌లుషిత నీరు స‌ర‌ఫ‌రాతో ప‌లు గ్రామాలలో ప్ర‌జ‌లు అతిసార భారీన ప‌డుతున్నారు… ఇప్ప‌టికే అతిసార‌తో ముగ్గురు మ‌ర‌ణించ‌గా, మ‌రో 30 మంది వివిధ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతున్నారు.. వివ‌రాల‌లోకి వెళితే ఆదోని పట్టణంలోని దేవర ఉత్సవాల్లో కలుషిత నీరు తాగి 30 మంది అతిసార‌కు గురయ్యారు. వారిలో ఒకరు మృతి చెందారు. గత రెండు రోజులుగా ఆదోని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులందరినీ మున్సిపల్‌ కమిషనర్‌ ఆర్జివి కృష్ణ, అసిస్టెంట్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రెడ్డి పరామర్శించారు. పట్టణంలోని అరుణ్‌ జ్యోతి నగర్‌లో మంగళవారం దేవర ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు భారీ ఎత్తున ప్రజలు హాజరయ్యారు. అక్కడ తాగునీరు కలుషితం కావడంతో… ఆ నీరు తాగిన కాలనీవాసులలో 30 మందికి వాంతులు, విరోచనాలయ్యాయి. అస్వస్థతకు గురయిన వారందరినీ వెంటనే ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోగులతో ఆసుపత్రి కిటకిటలాడింది. అలాగే పాణ్యం మండలం గోరుకల్లు లో అతిసార కు గురై ఇద్దరు మృతి చెందారు. గత మూడు రోజులుగా గోరుకల్లు నుంచి కలుషిత నీరు సరఫరా కావడం వల్లే వీరు అస్వస్థతకు గురైనట్లు గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. గ్రామంకు మంచి నీరు సరఫరా అయ్యే పైపుల్లో మురికి నీరు కలవడం వల్ల ప్రజలు అతిసార‌కు గురవుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement