Monday, September 16, 2024

Yemmiganur : వ్యవసాయ మార్కెట్ లో చోరీ…

ఎమ్మిగనూరు అర్బన్, సెప్టెంబర్ 5(ప్రభ న్యూస్): ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది. వ్యవసాయ మార్కెట్ లో షాప్ నెంబర్ S.42లో ట్రెడర్ వ్యాపారం చేస్తున్న దాన్య లక్ష్మి ట్రేడింగ్ కంపెనీ యజమాని శ్రీనివాసులు య‌దావిధిగా బుధవారం వ్యాపారం ముగించుకొని షాప్ మూసివేసి తాళం వేసి వెళ్ళాడు. గురువారం ఉదయం షాప్ న‌కు వచ్చి జరిగిన సంఘటనను చూసి మార్కెట్ కార్యదర్శికి తెలిపారు.

షాపులోని బీరువాలో ఉంచిన రూ.30వేలు నగదును దోచుకెళ్ళినట్లు బాధిత వ్యాపారి శ్రీనివాసులు మీడియాకు తెలిపారు. గత 5రోజుల క్రితం అదే షాప్ ప్రక్కన ఓ వ్యాపారికి చెందిన 3 వేరుశ‌న‌గ‌ బస్తాలు మాయమ‌య్యాయి. దీనిపై కూడా కార్యదర్శికి పిర్యాదు చేశారు. గతంలో కూడా ఇలాగే కొన్ని సంఘటనలు జరిగాయని రైతులు, వ్యాపారులు వాపోతున్నారు.

మార్కెట్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. విచిత్రం ఏమిటంటే చోరీ జరిగిన షాప్ ముందు సీసీ కెమెరా ఉంది. అది పనిచేస్తుందో లేదో తెలియదు. మార్కెట్ లో కూరగాయల మార్కెట్ ఏర్పాటు చేసినప్పటి నుండి ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని వ్యాపారులు, రైతులు, సిబ్బంది వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీలో ఇటువంటి సంఘటనలు జరగకుండా నిఘాను పటిష్ట‌ పరిచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement