ఆలూరు : ఆలూరు మండలంలోని హతీబేల్ గల్ గ్రామంలో గల కల్లివంకలో కురువ చెన్నకేశవ(18) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇతను సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సోమవారం సాయంత్రం సుమారు 5 గంటలకు వైన్స్ నుంచి మద్యం తీసుకొని వెళ్ళాడు. తరువాత ఏం జరిగిందో తెలియదు కానీ.. శవమై ఉన్నాడు. చనిపోయిన దగ్గర పురుగుల మందు బాటిల్ కనిపించింది. మద్యంలో పురుగుల మందు కలుపుకొని తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement