కరోనా లాంటి కష్టకాలంలో ప్రజల ప్రాణాలను ముందుండి కాపాడిన పారిశుద్ధ కార్మికులు, డాక్టర్స్, పోలీస్ ఫ్రంట్ లైన్ వారియర్ సేవలు అమోఘమని కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ విశ్వేశ్వరయ్య సర్కిల్ నందు నగర మేయర్, ఎంపి సంజీవ్ కుమార్, కమిషనర్ డి.కే. బాలాజీ, పోలిస్, డాక్టర్, పారిశుద్ధ్య కార్మికుల చేతుల మీదుగా కర్నూలు నగర పాలక సంస్థ నిర్మించిన క్లాక్ టవర్ ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ… కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలు సైత్యం లెక్కచేయకుండా ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ తమ కర్తవ్యాలను నిర్వహించారని, వారు చేసిన సేవలు ప్రజలకు తెలియాలనే ఈ క్లాక్ టవర్ నిర్మించడం జరిగిందని చెప్పారు. ప్రజలందరికీ చిరకాలం గుర్తుండిపోయేలా నిలిచిపోవాలనే ఉద్దేశంతో రూ.25లక్షలతో ఈ క్లాక్ టవర్ నిర్మించామన్నారు. ఇందులో ఫ్రంట్ లైన్ వారియర్స్ పోలీస్, డాక్టర్, పారిశుద్ధ్య కార్మికుల నమూనాలు పెట్టామన్నారు. ప్రజలందరీకీ ఇది ఆకర్షణీయంగా కనబడుతోందన్నారు. ఈకార్యక్రమంలో కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నగర మేయర్ బి వై రామయ్య, నగరపాలక సంస్థ కమిషనర్ బాలాజీ, మునిసిపాలిటీ అధికారులు, వార్డు కార్పొరేటర్లు, వైఎస్ఆర్సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement