Friday, November 22, 2024

Nandyala | విద్యార్థులను చితకబాదిన లెక్చరర్… కళాశాల ముందు ధర్నా

నంద్యాల బ్యూరో : నంద్యాల జిల్లాలో విద్యార్థులను లెక్చరర్ చితికబాదిన సంఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని డోన్ పట్టణంలోని ఒక కళాశాలలో గణిత సబ్జెక్టులో లెక్కలు చేయలేకపోయిన విద్యార్థులను ఆ కళాశాల గణిత లెక్చరర్ విచక్షణారహితంగా కొట్టారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లెక్చరర్ చేత దెబ్బలు తిన్న విద్యార్థులు ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పారు. వారు కళాశాలకు వచ్చి యాజమాన్యాన్ని నిలదీశారు.

కళాశాల ఎదురుగా విద్యార్థులు, తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు విద్యార్థులను ఆ లెక్చరర్ కొట్టిన సంఘటన నమోదైంది. విద్యార్థులను లెక్చరర్ చితకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. అందుకు సంబంధించిన వీడియోలు విద్యార్థుల తల్లిదండ్రులు యాజమాన్యానికి చూపించి నిలదీయడంతో ఖంగుతిన్నారు. ఆ లెక్చరర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు యాజమాన్యం సిద్ధమైనట్టు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement