Friday, November 15, 2024

రాజ్యాంగంలోని చట్టాలే ప్రజలకు రక్షణ

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకులు ఘ‌నంగా నిర్వ‌హించారు. 73వ భారత రాజ్యాంగ దినోత్సవం సంధర్బంగా శనివారం జిల్లా పోలీసు కార్యాలయం పేరడ్ మైదానంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి.ప్రసాద్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగబాబు రాజ్యాంగ రూపకర్త డా.బీ.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి.ప్రసాద్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ జి.నాగబాబు మాట్లాడారు… రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి, భారత రాజ్యాంగం పీఠికను చదివి వినిపించి పోలీసు అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. 1949 నవంబర్‌ 26న రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ ఆమోదించిందన్నారు. నవంబర్‌ 26న రాజ్యాంగసభ రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజునే ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహిస్తున్నామన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, విధులు, చట్టాలే ప్రజలకు రక్షణ అని, రాజ్యాంగానికి లోబడి ప్రతి ఒక్కరూ పనిచేస్తూ దేశాభివృద్దిలో పాలుపంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ గుణశేఖర్ బాబు, ఆర్ ఐలు రమణ, సురేంద్రా రెడ్డి, రవికుమార్, శివారెడ్డి , ఆర్ ఎస్సైలు, ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు, డిపిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement