కర్నూలు బ్యూరో : శ్రీశైల జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయంకు చెందిన 10 గేట్లు 15 అడుగుల మేర ఎత్తి 3,77,650 క్యూసెక్కుల నీటిని దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం డ్యాంకు ఇన్ ఫ్లో 4,07,648 క్యూసెక్కులుగా ఉంది. ఇక దిగువకు 3,95,652 క్యూసెక్కులు వెళ్తుంది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 215.8070 టీఎంసీలు గాను ప్రస్తుతం 215.3263 టీఎంసీలు నిల్వ చేశారు. ఇందులో జూరాల నుంచి 2,69,678 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,17,453, హంద్రీ నుంచి 20,440 క్యూసెక్కుల నీరు డ్యాంకు వస్తుంది. ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల పరిధిలోని కుడి, ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో నిరంతరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇందులో ఏపీ పరిధిలో 30,167 క్యూసెక్కుల నీటిని వినియోగించి 16.443 మెగా యూనిట్లు, తెలంగాణ పరిధిలో 35,315 క్యూసెక్కుల నీటితో 17.034 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. వీటితో పాటు ఏపీ పరిధిలోని హెచ్ ఎన్ఎస్ఎస్ 141, పోతిరెడ్డిపాడు నుంచి 10000, తెలంగాణ పరిధిలోని కల్వకుర్తికి 800 క్యూసెక్కులు, ఇక స్పిల్ వే గేట్ల్ ద్వారా 2,06,906 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదలవుతుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement