కర్నూలు : నగరంలోని సంకల్ బాగ్ నందు ఉన్న హరిహర క్షేత్రంలో ఆదివారం వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ సతీ సమేతంగా హాజరై ధ్వజారోహణ చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. బ్రహ్మోత్సవాలు ప్రారంభం కాగానే ఆలయం చుట్టూ గరుడ పక్షి.. ప్రదక్షిణలు చేయడం మంచి పరిణామమన్నారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ప్రతీ ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా గరుడ పక్షి రావడం ప్రదక్షిణలు చేయడం స్థల మహత్యమే అన్నారు. 17 సంవత్సరాలుగా ఎంతో నియమ నిష్ఠలతో భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణులు ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థల మహిమ వేద పండితులు పెట్టినటువంటి ముహూర్త బలం వల్లనే అదే సమయానికి గడపక్షులు రావడం జరుగుతుందన్నారు. పవిత్ర తుంగభద్ర తీరాన వెలసిన ఈ గుడిలో జరిగే బ్రహ్మోత్సవాల్లో నా చేతుల మీదుగా జరగటం పూర్వజన్మ సుకృతం అన్నారు. 11 రోజులపాటు వేదమంత్రాల మధ్య జరిగే బ్రహ్మోత్సవాలకు నగర ప్రజలందరూ హాజరై స్వామి కృపకు పాత్రులు కావాలన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement