నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని గాంధీ మెమోరియల్ పాఠశాలలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రంలో పరీక్ష ప్రారంభమైన గంట వ్యవధిలోనే అక్కడ పనిచేస్తున్న సిబ్బంది ద్వారా పరీక్ష పత్రం లీకైంది. ఒక వ్యక్తి సెల్ ఫోన్ ద్వారా ఇంగ్లీష్ పేపర్ -1 పరీక్ష పత్రం వాట్సప్ ద్వారా బయట వ్యక్తులకు చేరవేయడంతో అవి పలు గ్రూపుల్లో వెళ్లి హల్ చల్ చేశాయి. గాంధీ మెమోరియల్ పాఠశాలలో 12 సెంటర్లు, 12 ఇన్విజిలేటర్లు, 274 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. సమాచారం తెలుసుకున్న డీఈఓ రంగారెడ్డి, పట్టణ, రూరల్ సిఐ లు నాగరాజా రావు, ప్రసాద్ లు పరీక్ష కేంద్రానికి హుటాహుటిన చేరుకొని విచారిస్తున్నారు. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడిని సూపర్వైజర్ ను, విచారించి చర్యలు తీసుకుంటామని డీఈఓ తెలిపారు. ప్రశ్నపత్రం లీకేజీ పై పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం ? పాత్ర ఉన్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. డీఈఓతో పాటు తహశీల్దార్ రాజశేఖర్ బాబు, ఎస్ఐ లు మారుతీ శంకర్, వెంకట రమణ, తదితరులు ఉన్నారు.
ఆమడగూరు: పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఇవాళ ఇంగ్లిష్ పరీక్ష జరుగుతోంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే (ఉదయం 10గంటలకే) ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమైంది. సత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి పదో తరగతి ఇంగ్లిష్ పేపర్ లీకైనట్లు తెలుస్తోంది. మొదటిరోజు తెలుగు ప్రశ్నపత్రం సామాజిక మాధ్యమాల్లో రాగా.. రెండోరోజు హిందీ ప్రశ్నపత్రం బయటకు రావడం గమనార్హం.
Breaking: నందికొట్కూరులో ఇంగ్లీష్ పేపర్ లీక్
Advertisement
తాజా వార్తలు
Advertisement