ప్రేమించాడు.. అమ్మాయి తరుపున పెద్దలు మందలించడంతో మనస్థాపానికి గురైన యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చాక రాజువేములలో ప్రేమికురాలి తల్లిదండ్రుల బెదిరింపులతో దళిత యువకుడు ప్రసన్నకుమార్ (24) విషపు గుళికలు మింగి ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మలమడుగుకు చెందిన ఓ యువతిని ప్రసన్నకుమార్ ప్రేమించగా.. ఈ విషయం యువతి తల్లిదండ్రులకు తెలిసింది. మా అమ్మాయిని మర్చిపోవాలని, మరోసారి మా అమ్మాయి జోలికి వస్తే చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో మనస్తాపం చెందిన ప్రసన్నకుమార్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు యువతి తల్లిదండ్రులతో పాటు మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Suicide : మా అమ్మాయిని మర్చిపో.. లేదంటే చంపేస్తాం..! మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య..
Advertisement
తాజా వార్తలు
Advertisement