కర్నూలు, ప్రభ న్యూస్ : ఎన్ సీసీలో చేరిన విద్యార్థులకు భవిష్యత్తులో మంచి అవకాశాలు లభిస్తాయని ఎన్ సీసీ అధికారి కల్నల్ జోబీ ఫిలిప్స్ తెలిపారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఎన్‌సీసీ-సీ సర్టిఫికెట్‌కు సంబంధించిన పరీక్ష నిర్వహించారు. అందులో భాగంగా కర్నూలు జిల్లా వ్యాప్తంగా 400 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కర్నూలులోని మెడికల్ కళాశాల ఆడిటోరియంలో పరీక్ష నిర్వహించారు.
ఈ పరీక్షకు సంబంధించి ఎన్‌సీసీ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగింది. ఎన్‌సీసీ సర్టిఫికెట్ పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించేందుకు ఎంతగానో ఉపయోగపడతారని కల్నల్ ఫిలిప్స్ అన్నారు. ఎన్‌సీసీలో ప్రవేశం పొందిన విద్యార్థులు జీవితంలో ఉత్తమ పౌరులుగా ఎలా ఉండాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు.