Friday, November 22, 2024

గురుకుల హాస్ట‌ల్ లో విద్యార్థి మృతి..

నంద్యాల : ఆళ్లగడ్డ మండలం పడగండ్ల గ్రామంలోని గురుకుల పాఠశాలలో ఆరవ తరగతి చ‌దువుతున్న‌ విద్యార్థిని మృతి చెందింది. గత 15 రోజులుగా విద్యార్థిని అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే గురుకుల వసతి గృహానికి చెందిన సిబ్బంది మాత్ర‌లతో సరిపెట్టారు. శ‌నివారం ఉదయం గురుకుల పాఠశాల వసతి గృహంలో టిఫిన్ కోసం వేచి ఉండగా ఏళ్ల విద్యార్థిని కళ్ళు తిరిగి పడిపోయింది. వెంటనే వసతి గృహ సిబ్బంది ఆ విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించేందుకు ప్రయత్నించగా, అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. విషయం తల్లిదండ్రులకు చేరావేశారు. కాగా విద్యార్థిని హాస్టల్లో చనిపోతే.. ఇంటిదగ్గర చనిపోయినట్లు హాస్పిటల్లో హాస్టల్ వార్డెన్ చెప్పడం పట్ల పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు మృతి చెందిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వసతి గృహ హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement