Monday, November 18, 2024

KNL: టెక్నాలజీతో అసాంఘీక కార్యక్రమాలకు అడ్డుకట్ట.. ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా

నంద్యాల క్రైమ్, ఆగస్టు 27 (ప్ర‌భ న్యూస్) : నూతన సాంకేతిక పరిజ్ఞానంతో అసాంఘీక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు రంగం సిద్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో అసాంఘీక కార్యక్రమాలపై నిఘా ఉంచేందుకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలను అడ్డుకునేందుకు విజిబుల్ పోలీసింగ్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ లో భాగంగా పట్టణ శివారు ప్రాంతాల్లో, నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సదరు ప్రాంతాలపై అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచడం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై, ఇతర అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారిపై డ్రోన్ల సహకారంతో వారిని కనుగొని వారిపై కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు.

నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువు కట్ట చుట్టుపక్కల ప్రాంతాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై, బహిరంగంగా మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రతి సబ్ డివిజన్ కు ఒక డ్రోన్ కెమెరాను ఇవ్వడంతో పాటు విస్తృతంగా అసాంఘీక శక్తులు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement