Tuesday, November 19, 2024

గిరిజనులకు అండగా ఎస్టీ కమిషన్ : శంకర్ నాయక్

నంద్యాల : అట్టడుగున ఉన్న గిరిజనులకు వారి సంక్షేమ అభివృద్ధికి ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ భరోసా ఇచ్చారు. ఎస్టీ కమిషన్ సభ్యులు పర్యటనలో భాగంగా రెండో రోజు ఆత్మకూరు మండలం కొట్టాల చెరువు గ్రామాన్ని కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ సందర్శించారు. కరివేనా రవీంద్ర నాయక్, శివ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని ఆయన హాజరయ్యారు. కమిషన్ తో పాటు జీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజు నాయక్ పాల్గొన్నారు. చెంచు మహిళలు తమ సంస్కృతి సంప్రదాయాలతో నృత్యం చేస్తూ గ్రామస్తులు పూలమాలలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ గ్రామస్తులతో కలిసి ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. చెరువులో చాపల పెంపకంపై అధికారులు అడ్డుపడుతున్నారని ఎటువంటి లైసెన్స్ ఇవ్వకుండా, వారి జీవనోపాధికి అడ్డుకట్టవేస్తూ ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ముఖాముఖిలో ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. పునర్విభజన కింద ప్రతి కుటుంబానికి రెండు ఎకరాల చొప్పున పొలాలు, ఇళ్ల స్థలాలు ఇచ్చినట్లు చూపించారని, ఆ పొలాలు ఇప్పుడు అన్యాక్రాంతం అయ్యాయని లబ్ధిదారులు కమిషన్కు ఫిర్యాదు చేశారు. రేషన్ కార్డ్, ఆధార్ కేంద్రాన్ని గ్రామంలోని సెంటర్ను ఏర్పాటు చేసుకొని చెంచులకు అందుబాటులోకి ఉండేలా చూడాలని, కన్యాక్రాంతం అయిన పొలాలు లబ్ధిదారులకు అతి త్వరలోనే మంజూరు చేసి ఇవ్వాలని ఆర్డిఓకు ఎస్టి కమిషన్ సభ్యులు వడిత్యా శంకర్ నాయక్ ఆదేశాలు జారీ చేశారు. రీ సర్వే చేసి స్మశాన వాటికకు రెండు ఎకరాలు స్థలం కేటాయించాలని, ప్రతి ఒక్క చెంచు కుటుంబానికి స్థలం వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement