Tuesday, November 26, 2024

జలకళను సంతరించుకున్న శ్రీశైలం డ్యామ్..

కర్నూలు బ్యూరో : శ్రీశైలంకు జలకళ ఉట్టిపడుతుంది. ఎగువ జూరాల నుంచి కృష్ణమ్మ, కర్ణాటకలోని హోస్పేట్ నుంచి తుంగభద్ర నీటి పరవళ్లతో శ్రీశైలం డ్యాం నిండుకుండను తలపిస్తుంది. ఫలితంగా శ్రీశైలం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రంలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పాదన చేయడంతో పాటు, డ్యాం పరిధిలోని కాలువలకు భారీగా నీరు విడుదలవుతుంది. శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.90 అడుగులుగా ఉంది. ఇదే సమయంలో జలాశయంకు ఇన్ ఫ్లో 1,80,178 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుంది. ఇక జలాశయం నుంచి 1.11,164 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది. ఇందులో జలాశయంకు చెందిన మూడు స్పిల్ వే గేట్ 10 అడుగుల మేర ఎత్తి 84087 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో పాటు కల్వకుర్తి 627, హెచ్ ఎన్ఎస్ఎస్ కు 1575, పోతిరెడ్డిపాడుకు 7000 విడుదలవుతుంది. ఇక ప్రాజెక్టు పరిధిలోని కుడి ఎడమ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా సాగుతుంది. ఇందులో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 31,239 క్యూసెక్కులు వినియోగించి 16.374 మెగా యూనిట్లు, ఎడమ విద్యుత్ కేంద్రంలో 31784 క్యూసెక్కుల నీటి వినియోగంతో 17.059 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఇక జలాశయంలో పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 212. 4385 టీఎంసీల నీటి నిల్వలు ఉండటం గమనార్హం. ఇదే సమయంలో జూరాల నుంచి 71 వేల క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1.08 లక్షల క్యూసెక్కుల చొప్పున మొత్తం 1.80,178 క్యూసెక్కులు శ్రీశైలం డ్యాంకు చేరుకుంటుంది.

33 గేట్ల ద్వారా తుంగభద్ర నుంచి నీటి విడుదల …
కన్నడ ప్రాంత పరిధిలోని తుంగభద్ర డ్యామ్ కు వరద పోటెత్తుతుంది. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగుల గాను, ప్రస్తుతం 1632 అడుగులుగా ఉంది. ఇక జలాశయం లో నీటి నిలువలు 105 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 101.773 టిఎంసిల నీరు నిలువ ఉంది. ఇక జలాశయంకు ఇన్ ఫ్లో 136921 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 1,58,921 క్యూసెక్కులుగా ఉంది. ఇందులో డ్యాం కు చెందిన 33 స్పిల్ వే గేట్ల ద్వారా 148456 క్యూసెక్కుల నీరు విడుదలవుతుండగా, హెచ్ఎల్ సి , ఎల్ ఎల్ సి, ఎల్ ఎల్ సి ఏపీ , 10456 క్యూసెక్కుల చొప్పున విడుదలవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement