Friday, November 22, 2024

కృష్ణమ్మ పరవళ్లు… శ్రీశైలం డ్యాం వద్ద పర్యాటకుల సందడి..

కర్నూలు బ్యూరో : కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుంది. తుంగభద్ర తుళ్ళి పడుతుంది.. శ్రీశైల జలాశయానికి వరద పోటెత్తుతుంది. దీంతో డ్యాం వద్ద పర్యాటకులతో సందడి నెలకొంది. వీటికి తోడు ఆదివారం సెలవు దినం కావడంతో జలాశయం నుంచి కిందకు పడే నీటి అందాలను, వాటి సోయగలను కనుల తీర వీక్షించేందుకు పర్యాటకులు పోటీ పడుతున్నారు. దీంతో సున్నిపెంట నుంచి… డ్యాం వరకు వాహనాలు బారులు తీరాయి. శ్రీశైల జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884.80 అడుగులుగా ఉంది. ఇదే సమయంలో జలాశయం కు ఇన్ ఫ్లో 1,10,850 క్యూసెక్కుల నీటి ప్రవాహం చేరుతుండగా, జలాశయం నుంచి 1.19 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతుంది. ఇందులోజలాశయంకు చెందిన రెండు స్పిల్ వే గేట్10 అడుగుల మేర ఎత్తి 55966 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. వీటితో పాటు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా ఇతర కాలువలకు నీరు విడుదలవుతుంది.ఇక ప్రాజెక్టు పరిధిలోని కుడి ఎడమ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా సాగుతుంది. ఇందులో ఏపీ పరిధిలోని కుడి విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 31,608 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రంలో 31784 క్యూసెక్కుల నీటిని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. ఇక జలాశయంలోపూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం 214.3637 టీఎంసీల నీటి నిల్వలు ఉండటం గమనార్హం. ఇదే సమయంలో జూరాల నుంచి 55862 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 40640 క్యూసెక్కుల చొప్పున మొత్తం 90,502 క్యూసెక్కులు శ్రీశైలం డ్యాంకు చేరుకుంటుంది.

తుంగభద్రకు 90 వేల క్యూసెక్కుల వరదనీరు..

తుంగభద్ర డ్యామ్ కు వరద ప్రవాహం జోరు సాగుతుంది. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగుల గాను, ప్రస్తుతం 1631.86 అడుగులుగా ఉంది. ఇక జలాశయం లో నీటి నిలువలు 105 టీఎంసీలకు గాను, ప్రస్తుతం 101.226 టిఎంసిల నీరు నిలువ ఉంది. ఇక జలాశయంకు ఎగువ నుంచి 90,092 క్యూసెక్కుల నీరు వచ్చి చేరితుండగా, ఇక జలాశయం నుంచి దిగువకు 75290 క్యూసెక్కుల నీరు వెళుతుంది. ఇందులో స్పిల్ వే గేట్లతో పాటు హెచ్ఎల్ సి 1617, ఎల్ ఎల్ సి 930, ఎల్ ఎల్ సి ఏపీ 677 క్యూసెక్కుల చొప్పున విడుదలవుతుంది. ఇదే సమయంలో తుంగభద్ర డ్యాంకు తుంగనుంచి 37409, భద్ర నుంచి 40853 క్యూసెక్కుల ప్రవాహం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement