Tuesday, November 26, 2024

నిండుకుండలా శ్రీశైలం జలాశయం..

శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. ప్రాజెక్టుకు 1,52,396 క్యూసెక్కుల నీరు వస్తుండగా 51,164 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. రేపు ఆనకట్ట గేట్లు ఎత్తడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881.30 అడుగులుగా ఉంది. ప్రాజెక్టు కెసాసిటీ 215.807 టీఎంసీలు కాగా ప్రస్తుతం 195. 2102 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కుడి, ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement