రాష్ట్రంలో గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. స్పిల్ వే ద్వారా 2.25 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.జూరాల , సుంకేశుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 3.45 లక్షల క్యూసెక్కులు నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు 884.60 అడుగల వరకు నీరు ఉంది. పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలకు గాను 213.40 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేసిన 65,961 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement