Monday, November 18, 2024

శ్రీశైలం ప్రాజెక్ట్.. కుడి, ఎడమ కేంద్రాల్లో భారీగా విద్యుత్ ఉత్పత్తి…

కర్నూల్ బ్యూరో : శ్రీశైలం ఆనకట్ట పరిధిలో ముమ్మరంగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. ఇందులో ఏపీ కుడి విద్యుత్ కేంద్రం పరిధిలో 30614, తెలంగాణ పరిధిలోని ఎడమ విద్యుత్ కేంద్ర పరిధిలో 31,784 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్నారు. ఇందులో ఏపీ పరిధిలో 13. 857 మెగా యూనిట్లు, తెలంగాణ పరిధిలో 16.740 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇక శ్రీశైల జలాశయానికి కృష్ణ, తుంగభద్రల నుంచి వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, ప్రస్తుతం 884.50 అడుగులుగా ఉంది. ఇక జలాశయానికి
ఇన్ ఫ్లో 3,51,189 క్యూ సెక్కులుగా ఉంది. ఇందులో జూరాల నుంచి 2.46 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతుంది. ఇక సుంకేసుల బ్యారేజీ నుంచి 1.11 లక్షల చొప్పున మొత్తం 3,51,189 క్యూ సెక్కుల నీరు శ్రీశైల డ్యాంకు డ్యాంకు చేరుతుంది. ఇక జలాశయం నుంచి 4,31,0 890 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదవుతుంది. ఇందులో జలాశయానికి చెందిన 10 స్పిల్ వే గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇక ఏపీ పోతిరెడ్డిపాడు నుంచి 14000, హంద్రీనీవాకు 1688 చొప్పున మొత్తం 4.31 లక్షల క్యూసెక్కుల నీరు దిగువ సాగర్ కు వెళ్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement