Friday, October 4, 2024

KNL: పోలీసు క్రీడాకారిణిని అభినందించిన ఎస్పీ కృష్ణకాంత్

కర్నూల్ ప్రతినిధి : జాతీయ పోలీసు జూడో క్లస్టర్ ఆటల పోటీల్లో 2 కాంస్యం పథకాలు సాధించిన కర్నూలు ఆర్ముడు రిజర్వుడు ఆర్ ఎస్సై పి.కల్పనను శనివారం జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ అభినందించారు.

2024 జూన్ 24 నుండి జూన్ 30వరకు అస్సాం రాష్ట్రం – గౌహతిలో అస్సాం పోలీసుల ఆధ్వర్యంలో జరిగిన 9వ జాతీయ పోలీసు జూడో క్లస్టర్ ఆటల పోటీల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ తరుపున కర్నూలు జిల్లా పోలీసు శాఖ నుండి ఆర్ ఎస్సై పి.కల్పన తైక్వాండోలో ఒక కాంస్యం, సిలాట్ పోటీల్లో ఒక కాంస్యం, మొత్తం 2 కాంస్య (BRONZE) పతకాలు సాధించారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించాలని, జిల్లా పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ లు నారాయణ, జావేద్, ఆర్ ఎస్సైలు పావని, రవిశంకర్, రామస్వామి ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement