కర్నూలు నగరంలోని వన్ టవున్ వద్దగల బజార్ శ్రీ సీతా సమేత ఏకాంత రామాలయం లో అంగరంగ వైభవంగా కోవిడ్ నియమాలను పాటిస్తూ భక్తిశ్రద్ధలతో అర్చక స్వాముల వేదమంత్రోచ్చారణల మధ్య నిరాడంబరంగా 97 వ బ్రహ్మోత్సవాల్లో భాగంగా చైత్తబహుళ పంచమీ 5 వరోజు శనివారం అయిన నేడు తెల్లవారు ఝామున సుప్రభాత సేవ,పంచామృతాభిషేకం,అలంకార సేవ,అష్టోత్తర శతనామ పూజలు అర్చకులు మాళిగి రామూర్తి ఆచార్య నిర్వహించారు. వధూవరుల పక్షాన ఆలయం ప్రధాన అర్చకులైన మాళిగి హనుమేశాచార్య,భారతి దంపతులు సీతారాముల వివాహాన్ని నిర్వహించారు. అనంతరం శ్రీసీతారాములు మంటపంలో వేంచేసిభక్తులకు దర్శనమిచ్చారు అర్చకస్వాములు పుణ్యహవాచనం,రామస్వామి కి యజ్ఞోపవీత ధారణ, వరపాద ప్రక్షాళన, మధుపర్కం నిర్వహించారు. తదనంతరం తెరసెల్లా అడ్డుపెట్టి వేదవిదులు అందరూ మంగళాష్టకం పఠిస్తూ సుముహూర్త కాలానికి సీతారాములకు జీలకర్ర బెల్లం శిరస్సుపై ఉంచిన దృశ్యం హాజరైన అతికొద్ది మంది అతిథులకు కన్నులపండువగా కనిపించింది. కంకణ బంధనం, కన్యాదానం అనంతరం మాంగల్యం తంతునానేనా…లోకరక్షక హేతునా…( లోక రక్షణ కోసమే జగద్రక్షకులైన మీ కళ్యాణమని) అంటూ మాంగల్య ధారణ జరిగింది… ముత్యాల తలంబ్రాలను రామస్వామికి సీతామహాదేవి కి ధారగా వేసిన అనంతరం సీతమ్మ వారికి వడిబియ్యం కట్టి… సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయస్వామి వారలు ప్రజలందలందరినీ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమానికి విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహకార్యదర్శి యస్.ప్రాణేష్,నగర కార్యదర్శి మాళిగి భానుప్రకాష్,మరియూ మాళిగి సోదరులు,ఆలయకార్యనిర్వహణాధికారి దినేష్ తదితరులు పాల్గొన్నారు.
వైభవంగా శ్రీ సీతా సమేత ఏకాంతరాముని కళ్యాణోత్సవం
By sree nivas
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- ap news today
- Kurnool
- Kurnool Local News
- Kurnool news
- Kurnool News live
- Kurnool News Today
- kurnool News Today Live
- seetharamakalyanam
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today kurnool News
- Today News in Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement