ఆంధ్రప్రభ స్మార్ట్, హైదరాబాద్ :హైదరాబాద్ నీలోఫర్ ఆస్పత్రిలో కిడ్నాప్ అయిన శిశువు కేసును ఆరు గంటల్లోనే పోలీసులు ఛేదించారు. కిడ్నాప్ చేసిన మహిళతో పాటు మరో ఇద్దరిని కర్నూల్లో పట్టుకున్నారు. ఈ శిశువుతో పాటు మరో శిశువు కూడా వారితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను కర్నూల్ నుంచి హైదరాబాద్‌కు తరలించారు.
శిశువు మాయమైందిలా..
.జహీరాబాద్‌కు చెందిన హసీనా బేగం, గఫార్ దంపతులకు చెందిన నెలరోజుల పసికందు అనారోగ్యం బారిన పడటంతో అక్టోబర్ 29వ తేదీన నీలోఫర్ దవాఖానలో అడ్మిట్ చేశారు. కాగా, చికిత్స పొంది, కోలుకున్న పసికందును శనివారం దవాఖాన వైద్యులు డిశ్చార్జి చేశారు. అనంతరం దవాఖాన పాత భవనంలోని ఆరోగ్యశ్రీ కౌంటర్ వద్ద రవాణా ఖర్చులు తీసుకుని ఫొటో దిగుతుండగా.. పక్కనే ఉన్న గుర్తుతెలియని మహిళ వచ్చి చిన్నారిని తనకు ఇచ్చి ఫొటో దిగాలని చిన్నారి తల్లి హసీనాబేగంకు సూచించింది.
ఆమె మాటలు నమ్మిన హసీనాబేగం చిన్నారిని గుర్తుతెలియని మహిళకు ఇచ్చి ఫొటో దిగి, తిరిగి చూసేసరికి ఆ మహిళ అక్కడ కనిపించలేదు. శిశువు కూడా మాయమయ్యాడు. నాంపల్లి పోలీసులకు ఫిర్యాదుశిశువు మాయం కావడంతో దవాఖాన మొత్తం కలియతిరిగినా ఆ చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళ కనిపించలేదు. చేసేదిలేక తన బిడ్డ ఆచూకీ తెలుపాలని బోరున విలపిస్తూ హసీనాబేగం దవాఖాన సూపరింటెండెంట్‌తోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, సీసీటీవీ ఫుటేజీ సహాయంతో ఆరు గంటల్లోనే బిడ్డ ఆచూకీ కనుగొన్నారు. . కిడ్నాప్ చేసిన మహిళతో పాటు మరో ఇద్దరిని కర్నూల్లో పట్టుకున్నారు