- రాష్ట్రవ్యాప్తంగా రూ.4500 ఉన్న కోట్లతో… 30 వేల అభివృద్ధి పనులతో పల్లెలకు మహర్దశ
- కర్నూలు జిల్లాలో రూ.67.58 కోట్లతో 109 కిలో మీటర్ల మేర
- సిసి, బీటీ రోడ్ల నిర్మాణం..830 పనులు మంజూరు
- జిల్లాలో ఇప్పటికే 802 పనులు ప్రారంభం.. 541 పనులు పూర్తి
- జిల్లాలో సిసి, బీటి రోడ్లతో గ్రామాలకు నూతన శోభ
కర్నూల్ బ్యూరో : పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. గ్రామాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. పల్లెలకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఆలోచనతో కూటమి సర్కార్… ‘పల్లె పండుగ’ పేరుతో అక్టోబర్ 14 నుంచి 20వ తేదీ వరకు రాష్ట్రంలో నూతన కార్యక్రమాన్ని చేపట్టింది. తద్వారా పల్లెల్లో పనుల ‘పండుగ’ సందడి ప్రారంభమైంది. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టి సంక్రాంతికి ముందే పల్లెల్లో అసలైన పండుగ వాతావరణం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామాల అభివృద్ధికి ఒక కీలక ముందడుగు వేసింది ప్రభుత్వం..
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 13వేల 326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలను ప్రభుత్వం నిర్వహించింది. దేశంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి.గ్రామపంచాయతీలలో గ్రామసభలు నిర్వహించడం జరిగింది. ఆయా పంచాయతీల్లో తీర్మానాలు చేసి తీసుకున్న నిర్ణయాల మేరకు పల్లె సీమల్లో సిమెంటు రహదారులు, బిటి రహదారులు, ప్రహరీలు, గోకులాలు, పారిశుధ్య పనులు చేపట్టాలని నిర్ణయించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టే ఈ పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలనపరమైన అనుమతి, సాంకేతిక ఆమోదం లభించింది. గ్రామసభల్లో తీసుకున్న నిర్ణయాలు అమలుచేయడానికి అన్ని శాఖలను జిల్లా యంత్రాంగం ద్వారా సమన్వయం చేస్తున్నారు. సంక్రాంతి నాటికి పనులు పూర్తి చేసి పల్లెలకు అసలైన పండుగ తీసుకురావాలనేది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సంకల్పం.
పల్లెలకు పండుగే..
“పల్లె పండుగ -పంచాయతీ వారోత్సవాలు” పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టి అక్టోబర్ 14 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేశారు. ‘పల్లెపండుగ’ వారోత్సవాల్లో భాగంగా రూ.4,500 కోట్లతో 30 వేల అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా సిమెంట్ రోడ్లు, తారు రోడ్లు, గోకులాలు, వాన నీటి సంరక్షణ కందకాలు తదితర పనులను ప్రభుత్వం చేయడానికి సంకల్పించింది.
జిల్లాలో రూ 67 కోట్లతో సిసి, బీటీ రోడ్ల నిర్మాణం కొరకు 830 పనులకు ఆమోదం..
జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా యంత్రాంగాన్ని వేగంగా సమాయత్తం చేశారు. ఈ మేరకు పక్కా ప్రణాళికతో కార్యాచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తున్నారు. గ్రామ సభలో ఆమోదం పొందిన పనులకు సంబంధించి జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకం సమన్వయంతో పంచాయతీరాజ్ శాఖ ద్వారా కర్నూలు జిల్లాలో రూ 62 కోట్లతో…109 కిలో మీటర్ల మేర సిసి, బీటీ రోడ్ల నిర్మాణం నిమిత్తం 830 పనులకు జిల్లా కలెక్టర్ సత్వరం పరిపాలనపరమైన ఆమోదపు మంజూరు ఉత్తర్వులను జారీ చేశారు. జిల్లాలో 802 పనులు ప్రారంభించి… 541 పనులను పూర్తి చేయగా మిగిలిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి..
నియోజకవర్గాల వారీగా సీసీ, బీటీ రోడ్ల పనుల వివరాలు..
1.నియోజకవర్గం పేరు : పత్తికొండ
మొత్తం చేపట్టిన పనులు: 198
అంచనా ఖర్చు*: రూ 1611.00
ప్రారంభించిన పనులు : 191
పూర్తయిన పనులు : 137
ప్రగతిలో ఉన్న పనులు: 54
- నియోజకవర్గం పేరు : కోడుమూరు
మొత్తం చేపట్టిన పనులు: 133.
అంచనా ఖర్చు:రూ1027.10
ప్రారంభించిన పనులు : 129
పూర్తయిన పనులు : 97
*ప్రగతిలో ఉన్న పనులు: 32 - నియోజకవర్గం పేరు : పాణ్యం
*మొత్తం చేపట్టిన పనులు 68
అంచనా ఖర్చు:రూ 459.50.
ప్రారంభించిన పనులు : 67
పూర్తయిన పనులు : 57
ప్రగతిలో ఉన్న పనులు:10 - నియోజకవర్గం పేరు : ఆదోని
మొత్తం చేపట్టిన పనులు:30,
అంచనా ఖర్చు:రూ 200.00
ప్రారంభించిన పనులు : 30
పూర్తయిన పనులు : 20,
ప్రగతిలో ఉన్న పనులు: 10. - నియోజకవర్గం పేరు : ఆలూరు
మొత్తం చేపట్టిన పనులు: 197
అంచనా ఖర్చు:రూ1850.00
ప్రారంభించిన పనులు : 190
పూర్తయిన పనులు : 117
ప్రగతిలో ఉన్న పనులు:73 - నియోజకవర్గం పేరు : మంత్రాలయం
మొత్తం చేపట్టిన పనులు: 144
అంచనా ఖర్చు:రూ 962.50.
ప్రారంభించిన పనులు : 135,
పూర్తయిన పనులు : 64,
ప్రగతిలో ఉన్న పనులు: 71. - నియోజకవర్గం పేరు : ఎమ్మిగనూరు
మొత్తం చేపట్టిన పనులు: 60.
అంచనా ఖర్చు: రూ 648.00.
ప్రారంభించిన పనులు : 60,
పూర్తయిన పనులు : 49,
ప్రగతిలో ఉన్న పనులు: 11.
సిసి, బీటి రోడ్లతో కర్నూలు జిల్లా లో గ్రామాలు నూతన శోభ సంతరించుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం రాకతో.. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పనులు, సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం శాయశక్తులా కృషి చేస్తోంది. ఇందుకు ప్రజల నుంచి కూడా పూర్తి సహకారం అందుతోంది. వారు కూడా ఈ కార్యక్రమాలలో స్వచ్ఛందంగా భాగస్వాములు అవుతున్నారు. ఈసారి మట్టి రోడ్లపై కాకుండా మా గ్రామంలోని కళకళలాడుతున్న సిమెంట్ రోడ్లపై రంగురంగుల ముగ్గులతో సంక్రాంతిని జరుపుకుంటామని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామంలో రహదారుల సొబగులు..
తడకనపల్లి గ్రామంలో చర్చికి వెళ్లాలంటే క్రైస్తవ సోదరులు ఎంతో బాధపడేవారు, ఇక్కడ ఉన్న మట్టి రోడ్డు గుంతల మయమై ఉండేది కానీ ఈరోజు విష్ణు ఇంటి నుండి చర్చి వరకు దాదాపు 117 మీటర్ల సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టి మా గ్రామాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు 100 కుటుంబాలు ఈ రోడ్డు నిర్మించాక చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. రోడ్లతో గ్రామాలు బాగు పడుతుండడం శుభపరిణామం అని అంటున్నారు కల్లూరు మండలం తడకనపల్లి గ్రామానికి చెందిన షేక్ ఖుద్దుష్ బాషా..
రహదారులతో గ్రామాల అభివృద్ధి..
మా గ్రామంలో బస్తిపాడు ఆర్ అండ్ బి రోడ్డు నుండి మౌలాలి ఇంటి వరకు దాదాపుగా 214 మీటర్ల సిసి రోడ్డును నిర్మించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకు ముందు రోడ్డు బాగాలేక ఇబ్బందులు పడ్డాం..రహదారులతో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి.. ప్రభుత్వం రోడ్డు వేసినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పారు కల్లూరు మండలం, చిన్నటేకూరు గ్రామానికి చెందిన బజారి.