కర్నూలు: అనుమతి లేకుండా తరలిస్తున్న బంగారాన్ని భారీ మొత్తంలో పోలీసులు పట్టుకున్నారు. పంచలింగాల చెక్‌పోస్టు దగ్గర వాహనాల తనిఖీలలో ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న 14.8 కిలోల బంగారాన్ని గుర్తించారు..ఈ బంగారం విలువ రూ.6 కోట్ల 86 లక్షలు.. దానిని సీజ్ చేసి, ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.. కర్నూలు పట్టణ డిఎస్పీ కె.వి మహేష్ తెలిపిన వివరాల ప్రకారం కడప జిల్లా రైల్వే కోడూరుకి చెందిన రాతిమిద్దె రాజా తాడిపత్రిలోని అంబటి పుల్లారెడ్డి జ్యువెలర్స్ ఉద్యోగి.. అతడు ఈ నెల24న ఇక్కడి నుంచి హైదరాబాద్ కు వెళ్లాడు.. హైదరాబాదులోని అబిడ్స్ లోని మనో కామన గోల్డ్ షాపు నుంచి 100 గ్రా, బరువు కలిగిన 163 బంగారు బిస్కెట్లను తీసుకున్నాడు.. వాటిలోని 15 బంగారు బిస్కెట్లను హైదరాబాద్ లోని వేరే వేరే ప్రాంతాలలో వ్యక్తులకు డెలివరీ చేశాడు..మిగిలిన 148 బంగారు బిస్కట్లను తీసుకుని హైదరాబాద్ నుండి కర్నూలు వైపు మీదుగా ఆర్టీసే బస్సులో వస్తుండగా గురువారం తెల్లవారుజామున సుమారు 4.30 గంటల ప్రాంతంలో పంచలింగాల చెక్ పోస్టు వద్ద తనిఖీలు చేసిన సందర్భంగా ఈ బంగారం రవాణ గుట్టు బయటపడింది.. ఈ రవాణకు అవసరమైన పత్రాలు గానీ, టాక్స్ చెల్లించిన దృవపత్రాలు గానీ లేకపోవడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.. అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.. అలాగే అతడు పని చేస్తున్న జ్యుయిలరీ షాపు యాజమానిని కూడా స్టేషన్ కు పిలిచి విచారిస్తున్నారు..
రూ.6.86 కోట్ల విలువైన బంగారం పట్టివేత..
By sree nivas
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement