Monday, November 18, 2024

రూ.12 లక్షల బిల్లులు రాలేదని… సర్పంచ్ వినూత్న నిరసన

నందికొట్కూరు : నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో ఒక గ్రామ సర్పంచ్ వినూత్న నిరసన తెలిపారు. తనకు రావలసిన బిల్లులు దాదాపు గత రెండేళ్ళ పాటు పనులు చేసిన రూ.12 లక్షల బిల్లులు రాలేదని ఆవేదనకు గురై సర్పంచ్ వినూత్న నిరసన చేపట్టారు. నందికొట్కూరు నియోజకవర్గంలోని వడ్డెమాను గ్రామంలో గ్రామ సర్పంచ్ రామ చంద్రుడు గ్రామ పంచాయతీలో నిధులు లేవని అభివృద్ధి పనుల కోసం గ్రామంలో భిక్షాటన చేశారు. శుక్రవారం గ్రామ సర్పంచ్ రామ చంద్రుడు ఇంటింటికి తిరిగి భిక్షాటన చేస్తూ వినూత్నంగా నిరసన చేశారు.

గ్రామంలో పలు అభివృద్ధి కోసం అధిక వడ్డీలకు తెచ్చి రూ.12 లక్షలు ఖర్చు చేసి పనులు చేశామని ఇప్పటి వరకు బిల్లులు మంజూరు కాలేదన్నారు. అంతే కాకుండా గ్రామ పంచాయతీలో ఎలాంటి నిధులు లేకపోవడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందన్నారు. తాము ఖర్చు చేసిన బిల్లులు రాకపోగా నిధులు కూడా మంజూరు కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ లను చిన్న చూపు చూస్తుందని, సర్పంచులకు ఎలాంటి నిధులు కేటాయించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement