కర్ణాటకలో ఎగువన కురిసిన వర్షాలకు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా… ప్రస్తుత నీటిమట్టం 1607.78 అడుగులకు చేరింది. అలాగే పూర్తిస్థాయి నీటి నిల్వ 100 టీఏంసీలకు గాను… ప్రస్తుతం నీటినిల్వ 31.184 టీఎంసీలుగా కొనసాగుతోంది. జలాశయం ఇన్‌ఫ్లో 38890 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 359 క్యూసెక్కులుగా నమోదైంది. ఇదే ఆదివారం రాత్రి లక్ష, 32 వేల క్యూసెక్కులుగా ఉంది. సోమవారం ఉదయంకు తుంగభద్రకి వరద ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టింది.
సుంకేసులకు వరద ప్రవాహం :
సుంకేసుల ప్రాజెక్ట్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 13వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. దీంతో అధికారులు ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సుంకేసుల పూర్తి స్థాయి నీటినిల్వ 1.2 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.0 టీఎంసీలుగా కొనసాగుతుంది.
తుంగభద్రకి తగ్గిన వరద ప్రవాహం
Advertisement
తాజా వార్తలు
Advertisement