Friday, November 22, 2024

ఉయ్యాలవాడ పేరు పెట్టడంపై రచ్చ..

కర్నూల్ – చరిత్రలను వక్రీకరిస్తే సహించేది లేదని,దళిత బహుజనులంతా ఏకమై పోరాటం చేస్తామని విద్యార్థి,యువజన,ప్రజాసంఘాలు హెచ్చరించాయి.వేదవతి ప్రాజెక్టుకు ముత్తుకూరు గౌడప్ప పేరును,గుండ్రేవుల ప్రాజెక్టుకు గులాం రసూల్ ఖాన్ పేర్లు పెట్టాలని డిమాండ్ చేశాయి.రాయలసీమ యూనివర్సిటీలో గౌడప్ప విగ్రహాన్ని,ఉర్దూ యూనివర్శిటిలో గులాం రసూల్ ఖాన్ విగ్రహాలను పెట్టాలని ప్రభుత్వాన్ని కోరాయి.
కర్నూలు జిల్లా ఓర్వకల్ విమానాశ్రయానికి మొట్ట మొదటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పేరు పెట్టడాన్ని రాయలసీమ విద్యార్థి యువజన సంఘాలు,రాయలసీమ ఉద్యమ సంఘాలు తీవ్రంగా వ్యతిరేఖించాయి.ముత్తుకూరు గౌడప్ప సంఘం ఆద్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు.సంఘం అద్యక్షుడు బి.సత్యన్న అద్యక్షతన జరిగిన ఈ సమావేశానికి బిసి సంక్షేమ సంఘం,బిసి జనసభ,రాయలసీమ విద్యార్థి సంఘం,రాయలసీమ విద్యార్థి పోరాట సమితి,ఆర్ వైఎస్ఎఫ్,ప్రజా హక్కుల పరిరక్షణ వేదిక,రాయలసీమ ప్రజా సమితి,పిడిఎస్ యు,బుడగ జంగం సంక్షేమ సంఘం,తెర్నేకల ముట్టడి పుస్తక రచయిత,కవులు,రచయితలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉయ్యాలవాడ నరసింహా రెడ్డిని మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడని ఎలా అంటారని,1846 కంటే మందు రెండు పెద్ద తిరుగుబాట్లు జరిగాయని,మరి ఆ తిరుగుబాట్లు ముఖ్యమంత్రి జగన్ మోహన రెడ్డికి తెలియవా అని ప్రశ్నించారు.తిరుగుబాట్లు, పోరాటాలు చేసింది దళిత బహుజనులు అయినందువల్లే వాటిని పట్టించుకోకుడా ఉయ్యాలవాడే మొట్ట మొదటి స్వాతంత్ర్య సమరయోధుడని కీర్తిస్తూ విమానాశ్రయానికి పేరు పెట్టాడని ఆక్షేపించారు.చరిత్రలను వక్రీకరిస్తే చూస్తూ ఊరుకోమని,ఆత్మగౌరవ పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.రైతులతో సాంప్రదాయక పనిముట్లతో యుద్దం చేయించిన ముత్తుకూరు గౌడప్ప పేరును వేదవతి ప్రాజెక్టుకు,గుండ్రేవుల ప్రాజెక్టుకు గులాం రసూల్ ఖాన్ పేర్లను పెట్టాలని,వారి జయంతులు,వర్దంతులను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, రాయలసీమ యూనివర్శిటీ లో ముత్తుకూరు గౌడప్ప విగ్రహాన్ని, ఉర్దూ యూనివర్సిటీ లో గులాం రసూల్ ఖాన్ విగ్రహాన్ని పెట్టాలని, వీరి పోరాట చరిత్రలను పాఠ్యపుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్చాలని,తెర్నేకల్,జోహరాపురం గ్రామాలను పర్యాటక ప్రాంతాలుగా గుర్తించి పోరాట ఆనవాళ్లు చెదిరిపోకుండా కాపాడాలని డిమాండ్ చేశారు.
ఏప్రెల్ ఒకటిన కలెక్టర్ కార్యాలయం ముందు మహా ధర్నా చేయనున్నట్లు వారు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement