కర్నూలు : కర్నూలు పట్టణంలో రోడ్లపై విచ్చలవిడిగా తిరుగు తున్న గాడిదలను నగర మున్సిపల్ సిబ్బంది వాటిని పట్టుకుని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు. రోడ్లపై గాడిదల సంచారంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతున్నాయని వాటిని తీసుకొచ్చి మున్సిపల్ ఆవరణలో బంధించారు. నిన్న 20 గాడిదలను తీసుకెళ్లి సాయంత్రం విడిచిపెట్టారు. దీంతో ఆగ్రహించి రజక సంఘం ఆధ్వర్యంలో కర్నూల్ కార్పొరేషన్ రజక సంఘం నాయకులు గాడిదలతో మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకొని వెళ్లి ధర్నా నిర్వహించారు. తీసుకెళ్లిన గాడిదల్లో రెండు జీవాలు మరణించాయని, వాటికి కనీసం మంచి నీళ్లు కూడా పెట్టకుండా హింసించారన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ రజకులు ధర్నా నిర్వహించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement