కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలోనీ తిరుమల నగర్ లోని ఓ ఇంటిలో వ్యభిచారం నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు చేశారు. కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్, కర్నూల్, ధర్మవరం, తదితర ప్రాంతాల నుంచి అమ్మాయిలను పిలిపించి గృహ నిర్వాహకులు వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సీఐ నరసింహరావు వెల్లడించారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు 8 మంది విటులను, 10మంది యువతులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారించి వివరాలు వెల్లడిస్తామ న్నారు.