కర్నూలు : 75 వసంతాల స్వాతంత్రమును పురస్కరించుకొని భారత ఆహార సంస్థ, కర్నూల్ డివిషనల్ కార్యాలయంలో ఫోటో ఎక్సిబిషన్ నిర్వహించిందని డివిషనల్ మేనేజర్ కే. శశిధర రెడ్డి తెలిపారు. కరోనా లాక్డౌన్ సమయంలో భారత ఆహార సంస్థ దాదాపుగా 126 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సరఫరా చేసిందని, కోవిడ్ 19 సంక్షోభ సమయంలో ప్రైవేటుగా నడుపుతున్న సహాయ శిబిరాల్లో ఆహార పదార్థాల పంపిణీని సులభతరం చేయడానికి, బహిరంగ మార్కెట్ అమ్మకాల పథకం ధరలకు భారతదేశ ఆహార సంస్థ నుండి గోధుమలు మరియు బియ్యాన్ని ఇ వేలం ప్రక్రియ ద్వారా వెళ్ళవలసిన అవసరం లేకుండ నేరుగా కొనుగోలు చేయడానికి ఆహార మంత్రిత్వ శాఖ ఎన్.జి.వో మరియు స్వచ్ఛంద సంస్థలను అనుమతించింది. భారత ఆహార సంస్థ సాధించిన ప్రగతిని, ఆహార భద్రతకు ఈ సంస్థ చేస్తున్న సేవలను ఫోటో ఎక్సిబిషన్ లో పొందుపరిచామన్నారు. ఈ సందర్బంగా విశ్రాంత ఉద్యోగులను ఆహ్వానించి వారి పూర్వ అనుభవాలను, ఉద్యోగులందరితో పంచుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement