Monday, November 18, 2024

kurnool : వేదవతి సాధన లక్ష్యంగా టీడీపీ నేత‌ల‌ పాదయాత్ర…

ఆలూరు : గ‌త టీడీపీ ప్రభుత్వం ఎనిమిది టీఎంసీలుగా డిపిఆర్ ని ప్రతిపాదిస్తే ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు టీఎంసీలు వరకే కుదించడం అన్యాయమని, రాయలసీమ పశ్చిమ ప్రాంతమైన ఆలూరు నియోజకవర్గం ప్రతి సంవత్సరం కరువు కాటకాలు, అతివృష్టి లేదా అనావృష్టి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నార‌ని మాజీ కేంద్ర మంత్రి సూర్య ప్రకాశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ తెలిపారు. వేదవతి సాధన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ, మాజీ కేంద్ర మంత్రి సూర్య ప్రకాశ్ రెడ్డి నేతృత్వంలో పాదయాత్ర ప్రారంభమైంది. నియోజకవర్గ పరిధిలోని హాలహర్వి మండలం నుండి గల్యం గ్రామం వరకు ఈ పాదయాత్ర జరుగుతుందని తెలిపారు. వారు మాట్లాడుతూ.. రైతులను ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిండంలేదని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం తధ్యమని మొదటి ప్రాధాన్యత వేదవతి ప్రాజెక్టుకు కేటాయించి సంపూర్ణంగా పూర్తి చేస్తుంద‌ని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం నిధులు కేటాయించకుండా పనులు నిలిపివేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ సంవత్సరంలో కర్ణాటక, అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో అధిక వర్షాలు కురవడంతో వేదవతి నది పొంగిపొర్లింద‌ని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, అఖిల ప్రియ, బీసీ జనార్దన్ రెడ్డి, జయ నాగేశ్వర్ రెడ్డి, తిక్క రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకట్ రెడ్డి, భారీ సంఖ్యలో తెలుగుదేశం శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement