కర్నూలు జిల్లాలోని వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ను ప్రజా పద్దుల కమిటీ బృందం శనివారం మధ్యాహ్నం పరిశీలించింది. కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవులుతో పాటు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, తెలుగుగంగ చీఫ్ ఇంజనీర్ మురళి నాథ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఎస్ రామ సుందర్ రెడ్డి ప్రజా పద్దుల కమిటీ వెంట ఉన్నారు. తెలుగు గంగ కట్టమీద నిలబడి కమిటీ ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో పరిశీలించింది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి నిల్వలు, ప్రస్తుతం చేస్తున్ననీటి నిల్వలు, గేట్ల పటిష్టత, నిర్మాణ పనులకు సంబంధించి కర్నూల్ చీఫ్ ఇంజనీర్ మురళి నాథ్ రెడ్డి వారికి వివరించారు.
తెలుగు గంగ పరిశీలన అనంతరం అక్కడినుంచి ఈ బృందం లేరుగా బానక చర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఎస్ ఆర్ బి సి, తెలుగు గంగ, కేసీ కాలువకు నీటి మళ్లింపుపై పరిశీలించారు. అనంతరం అక్కడి నుంచి బృందం నేరుగా పోతిరెడ్డిపాడు కి చేరుకున్నారు. పోతిరెడ్డిపాడు పరిశీలన అనంతరం మల్యాలకు ప్రజా పద్దుల కమిటీ చైర్మన్ సభ్యులతో కలిసి వెళ్లనున్నట్లు సీఇ మురళీధర్ రెడ్డి తెలిపారు.