Friday, November 22, 2024

ఎస్ ఐ చొరవతో కర్నూల్ చేరుకున్న ఆక్సిజన్ వాహనం

కర్నూల్ బ్యూరో, ఆక్సిజన్ …. కరోనా సోకిన వారికి ప్రాణ వాయువు .ఆక్సిజన్ సరఫరా చేసే వాహనం కు ట్రబుల్ రావడంతో బళ్ళారి (కర్ణాటక రాష్ట్రం)లో నిలిచిపోయింది. ఈ విషయం కోవిడ్ 19 కంట్రోల్ రూమ్ కు సమాచారం వచ్చింది . ఈ విషయం తెలుకున్న జిల్లా కలెక్టర్ జి. వీరపాండియన్, జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప ఆదేశాలతో ఆక్సిజన్ కమిటి కన్వీనర్ జాయింట్ కలెక్టర్ రామ సుందర్ రెడ్డి, కోవిడ్ కంట్రోల్ ఇంచార్జ్ డిఎస్పీరాజీవ్ కుమార్ గారులు ఆ వాహానం ఎక్కడ ఉందో తెలుసుకుని హాలహార్వి ఎస్సై నరేంద్ర ను అక్కడికి పంపించారు. ఆక్సిజన్ ట్యాంకర్ వాహనానికి ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం , ఇబ్బందులు కలగకుండా అక్కడి స్ధానిక పోలీసుల సహాయంతో త్వరగా కర్నూలులో ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న కరోనా సోకిన వారికి ఆక్సిజన్ అందే విధంగా ఆక్సిజన్ ట్యాంకర్ తీసుకువచ్చి అవసరమైన ప్రాణా వాయువును అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement