నందవరం : మండల పరిధిలోని నాగలదిన్నె గ్రామంలో సోమవారం తుంగభద్ర నదిలో పడి ఎద్దు మృతి చెందింది. వివరాలు గ్రామానికి చెందిన రైతు కోడుమూరు బీమాకు చెందిన ఎద్దులను, బండితో కలసి ఆయన కుమారుడు చరణ్ వాటికి దాహం తీర్చడానికి చెంతనే ఉన్న తుంగభద్ర నదిలోకి తీసుకెళ్లారు. ప్రమాదవశాత్తు ఎద్దులు బండి లోతుకు వెళ్ళడంతో చరణ్ సాహసం చేసి ఒక ఎద్దు జతుకులు విడదీసి కాపాడడం జరిగింది. మరో ఎద్దు మృతి చెందింది. దాదాపు అరవై వేల రూపాయల విలువ చేసే ఎద్దు మృతి చెందడంతో రైతు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు ఎద్దును వెలికి తీసి పూడ్చి పెట్టారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement