నంద్యాల – నంద్యాలలో రోజులు గడిచేకొద్దీ కరోనా సెకండ్ వేవ్ పెరుగుతూ పోతుంది. ప్రభుత్వ అధికారులు ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోమని చెబుతున్నారు. అలాగే నంద్యాల పట్టణంలో కూడా కేసులు వస్తున్నాయి ఆ తరుణంలో నంద్యాల పట్టణంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తమై ఉండాలి.. అయితే నంద్యాల పట్టణంలో ఉన్న సినిమా థియేటర్ లలో కరోనా నిబంధనలు ఏమాత్రం పాటించకుండా మాస్కులు లేకుండా శానిటైజర్ చేయకుండా భౌతిక దూరం పాటించకుండా సినిమా థియేటర్లు నడుపుతున్నారని డివైఎఫ్ ఐ ఆరోపించింది. .నంద్యాలలో కరోనా నిబంధనలు పాటించకుండా నడుపుతున్న సినిమా థియేటర్ ల పైన చర్యలు తీసుకోవాలని నంద్యాల డివైఎఫ్ఐ పట్టణ కమిటీ సబ్ కలెక్టర్ ఆఫీస్ ఈవో కి వినతి పత్రం అందజేశారు.. డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ , నాయకులు పవన్ కృష్ణ శివ లు ఈ సందర్బంగా మాట్లాడుతూ, థియేటర్లలో బౌతిక దూరం పాటించడం లేదని, మాస్క్ లు లేకుండానే లోపలకి అనుమతిస్తున్నారని అన్నారు.. ఇటువంటి చర్యలు వల్ల కరోనా మరింత పెరిగే అవకాశం ఉందని, వెంటనే థియేటర్స్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement