Tuesday, November 26, 2024

వర్కురు గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డ్ – అభినందించిన క‌లెక్ట‌ర్

కర్నూలు – జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూఢిల్లీలో కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సశక్తికరణ్‌ పురస్కార్‌ అవార్డులను దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పాల్గొన్నాజిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, డిపిఓ ప్రభాకర్ రావ్, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి, కోడుమూరు మండల ఈఓపిఆర్ డి ఆర్.మంజుల, వర్కురు గ్రామ పంచాయతీ కార్యదర్శి మహేష్, తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో కేంద్ర పంచాయతీరాజ్‌ మంత్రిత్వ శాఖ ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సశక్తికరణ్‌ పురస్కార్‌ కింద ఏటా అందజేసే జాతీయ పంచాయతీ అవార్డులు-2021సంవత్సరానికి…కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వర్కురు గ్రామపంచాయతీకి దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సశక్తికరణ్‌ పురస్కార్ అవార్డు దక్కిందని, ఈ అవార్డును శనివారం విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది చేతులమీదుగా వర్కురు గ్రామపంచాయతీ సర్పంచ్ ఎం.లక్ష్మీదేవి అవార్డ్ అందుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. వర్కురు గ్రామపంచాయతీ లో ఈ-గవర్నెన్స్‌, గ్రామ పంచాయతీ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ (జీపీడీపీ), పరిసరాల పరిశుభ్రత, అభివృద్ధి, తదితర అంశాల్లో గ్రామం అభివృద్ధి, ప్రణాళిక గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ అవార్డు దక్కినట్లు జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. ఇందుకు కృషిచేసిన డిపిఓ ప్రభాకర్ రావ్, కోడుమూరు ఎంపిడిఓ మంజుల వాణి, ఈ ఓ పి ఆర్ డి మంజుల, వర్కురు గ్రామ పంచాయితీ సర్పంచ్ ఏం.లక్ష్మీదేవి, పంచాయతీ కార్యదర్శి సంజీవ్ కుమార్, మహేష్ తదితరులను జిల్లా కలెక్టర్ అభినందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement