కర్నూలు : ప్రభుత్వ గుర్తింపు లేకుండా, బిల్డింగ్ నిర్మాణం పూర్తి కాకుండా అడ్మిషన్ చేస్తున్న నారాయణ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలని పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి.సోమన్న, ఏఐఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి ఏ.నాగరాజు డిమాండ్ చేశారు. కర్నూల్ నగరంలో జొహరాపురం రోడ్డుకు ఉన్న నారాయణ బిల్డింగ్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్ యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.భాస్కర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి.సోమన్న, ఏఐఎస్ఎ రాష్ట్ర కార్యదర్శి ఏ.నాగరాజు మాట్లాడుతూ…. కర్నూల్ నగరంలో జోహాలాపురం నందు ప్రభుత్వ గుర్తింపు లేకుండా, బిల్డింగ్ నిర్మాణం కాకుండా అక్రమంగా అడ్మిషన్ లు చేస్తున్న నారాయణ పాఠశాలను తక్షణమే సీజ్ చేయాలన్నారు. విద్యాధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేని పరిస్థితుల్లో విద్యా అధికారులున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా బహిరంగంగా ఫ్లెక్సీల రూపంలో టెక్నో, ఈ టెక్నో, ఒలంపియాడ్, సిఓ, మెడికల్, కోర్సుల పేరుతో ప్రదర్శించారు. అలాంటి కోర్సులతో అడ్మిషన్ చేసుకుంటే వారిపైన జరిమానా విధించాలని విద్యాశాఖ అధికారులు జీవోలు అమలు చేస్తున్న ఇప్పటివరకు ఏమాత్రం కూడా జరిమాన విధించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణ పాఠశాల ప్రభుత్వ జీవోలను, విద్య అధికారులను లెక్కచేయకుండా అడ్మిషన్ చేసుకుంటూ వేలకు వేలు ఫీజులు దండుకుంటున్నారని అన్నారు. తక్షణమే నారాయణ పాఠశాలను సీజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎ జిల్లా అధ్యక్షుడు నాగార్జున, ఏఐఎస్ఎఫ్ నగర కోశాధికారి అశోక్, పీడీఎస్ యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆది, జిల్లా ఉపాధ్యక్షుడు రమణ, నగర అధ్యక్షుడు దామోదర్, నగర నాయకులు నవనీత్, వర్ధన్, ఏఐఎస్ఎ నగర కార్యదర్శి నాని, తదితరులు పాల్గొన్నారు.