Friday, November 22, 2024

కొవిడ్ సెంట‌ర్ ను ప‌రిశీలించిన స‌బ్ క‌లెక్ట‌ర్..

నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనా కుమారి నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకట కృష్ణ తో కలిసి నంద్యాల ఎస్ ఆర్ బి సి కాలనీ లోని కోవిడ్ కేర్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అక్కడ రోగులకు అందుతున్న సేవలను, సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలలో ఎవరికైనా కోవిడ్ లక్షణాలు కనిపించిన తక్షణమే కోవిడ్ టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాల‌ని కోరారుఉ. రు ఒకవేళ పాజిటివ్ వచ్చినట్లయితే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ కి రావాలని సూచించారు. కో ఆహ్లాదకరమైన వాతావరణంలో నంద్యాల పట్టణానికి దగ్గరగా ఉన్న ఎస్ ఆర్ బి సి కాలనీ లోని టిడ్కో గృహాలలో ఈ సెంట‌ర్ ను ఏర్పాటు చేసిందని అన్నారు. ఈ కేంద్రాలలో మౌలిక సదుపాయాలతో పాటు మంచి ఆహారం 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అత్యవసరమైతే మెరుగైన చికిత్స కొరకు 104 వాహనాల ద్వారా వైద్యుల పర్యవేక్షణలో ఆస్పత్రులకు కూడా పంపడం జరుగుతుంద‌ని అన్నారు . ఇప్పటికే నంద్యాల పట్టణంలో వ్యాక్సినేషన్ కూడా వేస్తున్నారనిచ అర్బన్ హెల్త్ సెంటర్లలో కూడా వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుంది అన్నారు నంద్యాల పట్టణంలోని టౌన్ హాల్ నందు కోవిడ్ టెస్టింగ్ లు చేస్తున్నారని పేర్కొ న్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement