Friday, November 22, 2024

Nandyala – విద్యా సాధికారత జగన్ తోనే సాధ్యం : రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ

కర్నూలు, డిసెంబర్ 12, ప్రభ న్యూస్ బ్యూరోరాష్ట్రంలో విద్యా సాధికారత – జగనన్నతోనే సాధ్యమని దిక్కులు పిక్కటిల్లేలా నంద్యాల వేదికగా విద్యార్ధి లోకం గొంతెత్తి నినదించింది. నంద్యాల జిల్లా వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు సురేష్ యాదవ్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు నంద్యాలలోని స్థానిక పద్మావతి నగర్ జ్యోతిబా పూలే విగ్రహం దగ్గర నుంచి శ్రీనివాస సెంటర్ లోని దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్సార్ విగ్రహం వరకు పది వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య, రాయలసీమ విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ ఛైర్మైన్ బి.శ్రీరాములు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ విద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకొస్తూ విద్యార్థుల సంక్షేమం కొరకు విద్యా కానుక, విద్యా దీవెన, వసతి దీవెన లాంటి ఏంతో ప్రతిష్టాత్మక కార్యక్రమములు అమలు చేస్తూ విద్యార్థుల ఆరోగ్యంగా ఉండాలని జగనన్న గోరు ముద్ద గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన – వాళ్ళ ప్రభుత్వ పాఠశాలలను,సాంఘిక,సంక్షేమ వసతి గృహాలను,కాలేజ్ భవనాలను నాడు-నేడు అనే కార్యక్రమంతో ఎంతో తీర్చిద్ది విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తున్న జగనన్న ప్రభుత్వానికి మళ్ళీ అండగా ఉండాలని కోరారు. .

మా బ్రతుకులు మారాలంటే… మా తలరాతలు మేమే రాసుకోవాలంటే ఉన్నత విద్యా, అత్యున్నత ఉద్యోగ అవకాశాలతో మా జీవన స్థితిగతులలో సమూలమైన మార్పు రావాలంటే మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలంటూ విద్యార్థులు చేసిన నినాదాలతో నంద్యాల హోరెత్తింది.

ఈ కార్యక్రమంలో వైసీపీ విద్యార్ధి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య , రాయలసీమ విద్యార్ధి , యువజన సంఘాల జేఏసీ చైర్మన్లు బి.శ్రీరాములు, రామినేని రాజునాయుడు, జేఏసీ అధ్యక్షులు బందెల ఓబులేసు , కన్వీనర్లు శేక్ రియాజ్ , జయరాజు , రవీంద్ర నాయక్ ,నాగరాజు , రమేష్ , గుట్టపాడు రాజు, వైసీపీ విద్యార్ధి విభాగం నేతలు రెడ్డిపోగు ప్రశాంత్, దిలీప్, గౌతమ్ తదితరులు నేతలు దివాకర్ , అశోక్, ఖాదర్, బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement