Friday, November 22, 2024

TDP MP | అన్నిరంగాల్లో అనుబంధం అవసరం.. ఆసీస్ పార్లమెంట్లో ఎంపీ శబరి సందడి

( ఆంధ్రప్రభ స్మార్ట్, కర్నూలు బ్యూరో) : మనవాళి మనుగడకు, శాస్త్రీయ సాంకేతిక శక్తి, నైపుణ్యాన్ని జోడించినప్పుడే భారత్, ఆస్ట్రేలియా భవిష్యత్ ప్రయోజనకరమని నంద్యాల ఎంపీ, భారత లోక్ సభలో టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆస్ట్రేలియా మెలబోర్న్ విక్టోరియన్ పార్లమెంట్ లో నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తన అద్భుత ప్రసంగంతో ఆస్ట్రేలియా పార్లమెంట్ ను ఆకట్టుకున్నారు. భారతీయుల మానవత్వం, సేవా గుణాన్ని విశధీకరించారు. అగ్ర రాజ్యాలకు ధీటుగా భారత్ ఆర్ధికంగా ఎదుగుదల, ప్రపంచ దేశాలతో భారతదేశం స్నేహం తీరును శబరి వివరించారు.

ఆస్ట్రేలియా – భారతదేశం మధ్య ఎగుమతులు, దిగుమతుల బలోపేతం, భారత్ తో – ఆస్ట్రేలియా బంధం బలోపేతం కోసం ఇరుదేశాలు ముందుండాలని కోరారు. ఆస్ట్రేలియాలోని భారత సంతతికి చెందిన వైద్యులను ప్రోత్సహించించేందుకు ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. తాను ఇంటర్వేన్సన్ రేడియాలాజిస్ట్ డాక్టర్ అని, నంద్యాల ఎంపీ, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హోదాలో తనను ఆస్ట్రేలియా మెల్ బోర్న్ విక్టోరియన్ పార్లమెంట్ ఉభయ సభ్యులనుద్దేసించి ప్రసంగించేందుకు అవకాశం కల్పించిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోల్ ఆల్పోనిస్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశ ప్రతినిధిగా ఇక్కడకు పంపిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, ఈ మంచి అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement