Monday, November 18, 2024

కరోనా మహమ్మారి సమర్థవంతంగా ఎదుర్కొందాం : మంత్రి బుగ్గన

కర్నూలు – కోవిడ్ కట్టడి చర్యలు, కోవిడ్ వ్యాక్సినేషన్ పై స్టేట్ గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్, ఎస్పీ, జేసీలు, మునిసిపల్ కమిషనర్, జిల్లా అధికారులు, డిఎంహెచ్ఓ, ప్రభుత్వ , ప్రవేట్ కోవిడ్ ఆసుపత్రుల సూపర్ఇంటెండెంట్స్ తో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ లు సమీక్ష నిర్వహించారు. సమీక్ష లో నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానంద రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జ్.సుధాకర్, నంది కొట్కూరు ఎమ్మెల్యే తొగురు ఆర్థర్, కర్నూలు నగర పాలక సంస్థ మేయర్ బి.వై రామయ్య, ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జేసీలు రామసుందర్ రెడ్డి , సయ్యద్ ఖాజా, కె.ఎం.సి.కమీషనర్ డీకే బాలాజీ, ఏ.ఎస్.పి గౌతమి సాలి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నూరుల్ ఖమర్, డిఎంహెచ్ఓ, ప్రభుత్వ , ప్రవేట్ కోవిడ్ ఆసుపత్రుల సూపర్ఇంటెండెంట్స్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన మాట్లాడుతూ గత సంవత్సరంలో భారతదేశంలో కరోన కేసులు మొదలైనప్పుడు కర్నూలు జిల్లాలో అత్యధిక కేసులు నమోదయ్యాయని, జిల్లా యంత్రాంగం ఎంతో సమర్థవంతంగా చాలా చక్కగా పనిచేసి కరోనా వైరస్ కట్టడి చేయగలిగి జిల్లా కలెక్టర్ ప్రశంసలు అందుకోవడం జరిగిందన్నారు. కరోన సెకండ్ వేవ్ ను అన్ని విధాలుగా ఎదుర్కొనేందుకు అధికారులందరూ బాధ్యతగా సమర్థవంతంగా పనిచేసి కరోనా కట్టడి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా కట్టడికి అవసరాలు ఏమి… ఎలా ఎదుర్కోవాలి… మీ సమస్యలు తెలిపితే రాష్ట్రస్థాయిలో తీసుకెళ్లి పరిష్కరించడం జరుగుతుందన్నారు. శాంపుల్ కలెక్ట్, టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ పకడ్బందీగా చేపట్టాలన్నారు. అధికారులందరూ ఛాలెంజ్ గా తీసుకొని కరోన సెకండ్ వేవ్ ఎదుర్కోవాలి అన్నారు. కోవిడ్ కేర్ సెంటర్ కర్నూలు, నంద్యాల, ఆదోని టిడ్కో హౌస్ ల్లో ఫుడ్, శానిటేషన్ ల ప్రత్యేక ఫోకస్ పెట్టి కరోనా బాధితులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. కోవిడ్‌ పరీక్ష మొదలు.. వైద్యం, ఆస్పత్రులలో మెడిసిన్, శానిటేషన్, క్వాలిటీ ఆఫ్‌ ఫుడ్‌ వరకు ఎక్కడా కూడా రోగులు ఇబ్బంది పడకుండా చూడాలన్నారు. 104 కాల్ సెంటర్ కు ఫిర్యాదు వచ్చిన వెంటనే మూడు గంటల లోపు టెస్టింగ్ పూర్తి చేయాలన్నారు. ప్రైవేట్ కోవిడ్ కేర్ ఆసుపత్రిలో ప్రభుత్వం నిర్ణయించిన ధర మాత్రమే తీసుకునేలా నోటీస్ బోర్డ్ లో డిస్ ప్లే తో పాటు హాస్పిటల్ బయటవైపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. కోవిడ్ హాస్పటల్లో ఆక్సిజన్, వెంటిలేటర్, డ్రగ్స్ కావలసినవన్నీ అందుబాటులో ఉంచుకోవాలని ఏమైనా కావాలంటే తెలియజేయాలన్నారు.
కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో కోవిడ్ పేషెంట్ల తో పాటు నాన్ కోవిడ్ పేషెంట్లకు కూడా వైద్య చికిత్సలు అందించాలని, గత సంవత్సరంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి లో నాన్ కోవిడ్ పేషెంట్లకు వైద్య చికిత్సలు అందలేదని ఫిర్యాదులు అందాయని అలా కాకుండా ఎమర్జెన్సీ, ప్రెగ్నెన్సీ వారికి కచ్చితంగా జీజీహెచ్లో వైద్య చికిత్స అందించేలా చూడాలని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రుల నిర్వాహకులు అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని హాస్పిటల్ బయట వైపు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఆసుపత్రి వద్ద ప్రైవేట్ అంబులెన్స్లో వారు కోవిడ్ బాధితుల నుంచి అత్యధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారని అలా కాకుండా చూడాలని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు.
అనంతరం జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ జిల్లాలో జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అందరి సహకారంతో మొదటి దశ కరోనా వైరస్ ను కట్టడి చేయగలిగామన్నారు. కరోనా సెకండ్ వేవ్ మార్చి నెలలో కేసులు నమోదు కాలేదని, దాదాపు ఈ నెలలో ఈరోజు వెయ్యి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అన్నారు. జిల్లాలో పాజిటివ్ 67,317, పాజిటివ్ రేట్ 5.02, డేత్స్ 516, పెటలిటీ రేట్ 0.77, డేత్స్ ఫర్ మిలియన్స్ 127.41, డిచార్జర్స్ 62,558, రికవరీ రేట్ 92.93, ఆక్టివ్ కేసెస్ 4.243, యాక్టీవ్ రేట్ 6.30 కలదన్నారు. కర్నూలు జిల్లాలో 18 కోవిడ్ ఆస్పత్రులను నోటిఫై చేయడం జరిగిందని పదహైదు ప్రైవేట్ కోవిడ్ ఆసుపత్రులు, మిగిలిన మూడు ప్రభుత్వ కోవిడ్ హాస్పిటల్ కలవన్నారు. కేసులు పెరిగేకొద్ది హాస్పిటల్ సంఖ్యను మరింత పెంచుతామన్నారు. కర్నూలు, నంద్యాల, ఆదోని కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసామని నంద్యాలలో ఈ రోజు ఏడు మంది కోవిడ్ పాజిటివ్ బాధితులు చేరారని జిల్లాలో కోవిడ్ స్థితి గతులు, కోవిడ్ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్ పై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ జిల్లా కలెక్టర్ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement