Friday, November 22, 2024

ఎపి రాజ‌కీయాల‌లో ఎంఐఎం ఎంట్రీ…

కర్నూల్ బ్యూరో, – కర్నూల్ రాజకీయాలపై మజ్లిస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. హైద్రాబాద్‌కే గతంలో పరిమితమైన మజ్లిస్ పార్టీ క్రమక్రమంగా మహారాష్ట్ర, కర్నాటక, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలకు విస్తరించింది. తాజాగా బెంగాల్ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుంది. మరోవైపు ఏపీలో పాగా వేయాలనే ఆలోచనతో మజ్లిస్ ముందుకు కదులుతుంది. ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ వ్యవహార శైలి చూస్తోంటే తాజాగా కర్నూలు వైపు మళ్ళింది. ఇందులో భాగంగా ఓవైసీ అధినేత జిల్లాలో పర్యటించారు. ప్రస్తుతం మజ్లిస్ పార్టీ తరఫున మున్సిపల్ ఎన్నికల్లో కర్నూల్ తో పాటు ఆదోని, నంద్యాల, డోన్ నందికొట్కూర్ అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఈ క్రమంలో ఆదోని లో పర్యటించిన అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. మజ్లిస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు. కాగా అంతకుముందు మజ్లీస్ పార్టీ బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులను కోరిన అధికారులు సమ్మతించలేదు. ఈ విషయంపై ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరిన ముఖ్యమంత్రి జగన్ మున్సిపల్ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకపోవడం పై మండిపడ్డారు. తమ బహిరంగ సభకు అనుమతి ఇవ్వవద్దని ఆదోని ఎమ్మెల్యే పోలీసులకు సూచించేందుకు ఆయన ఎవరిని అని ప్రశ్నించారు. అనంతరం ఆదోని నుంచి బయలుదేరిన ఆయన మార్గమధ్యలో కోడుమూరు వద్ద
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్‌కి సంఘీభావం పలికారు. స్థానికంగా వున్న మజ్లిస్ మద్దతుదారులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం నేరుగా కర్నూలు చేరుకొని పాతబస్తీలోని ఓ ప్రైవేటు భవనంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా మజ్లిస్ అభిమానుల హంగామా కర్నూలులో గట్టిగానే కనిపించింది. ప్రస్తుత పరిస్థితుల్లో మజ్లిస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ ,బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమ అభివృద్ధి కి ఈ విధంగా పాటుపడుతుంది, వారి హక్కుల పరిరక్షణకు ఏ విధంగా తోడ్పడుతుంది అన్న అంశాలను ప్రస్తావించారు. దేశంలో కొన్ని కుహానా పార్టీలు తమన అడ్డుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బిజెపి, ప్రధాని మోడీ పై ఈ సమావేశంలో మజ్లీస్ అధినేత విరుచుకుపడ్డారు. మజ్లీస్ అధినేత పర్యటనను దృష్టిలో పెట్టుకొని పాతబస్తీలో పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. కిక్కిరిసిపోయిన హాల్లో మైనార్టీ వర్గాల ఉద్దేశించి మజ్లీస్ అధినేత ప్రసంగించారు. రాత్రి 9:30 గంటల వరకు ఆయన ప్రసంగం కొనసాగింది. నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తున్న మజిలీ అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా మైనార్టీ లను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రసంగం అనంతరం ఆయన హైదరాబాద్ కు వెళ్లిపోయారు. మొత్తంగా రాష్ట్రంలో అత్యధికంగా మైనార్టీలు ఉన్న కర్నూలు జిల్లాలో మజ్లీస్ అధినేత పర్యటించడం పర్యటించడం చర్చనీయాంశంగా మారింది.
2019 ఎన్నికల సమయంలో మజ్లిస్ పార్టీ పరోక్షంగా వైసీపీకి సహాయ సహకారాలు అందించింది. అప్పట్లో మిత్రపక్షం తెలంగాణ రాష్ట్ర సమితితో కలిసి, వైఎస్ జగన్‌కి అండగా నిలిచారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ. కర్నూలు, అనంతపురం, కడప తదితర జిల్లాల్లోనూ మజ్లిస్ పార్టీకి కొందరు మద్దతుదారులున్నారు. అయితే, మజ్లిస్ అనేది ఇంతవరకూ ఆంధ్రపదేశ్లో రాజకీయ పార్టీగా తన ఉనికిని చాటుకున్నది లేదు. మునిసిపల్ ఎన్నికల వేళ, మజ్లిస్ అధినేత కర్నూలులో పర్యటించడం రాజకీయంగా చర్చనీయాంశమయ్యింది. ఇది వైసీపీకి అనుకూలమా.? టీడీపీకి అనుకూలమా.? బీజేపీకి అనుకూలమా.? అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement