తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఉదయం తుంగభద్ర నదికి ఇన్ ఫ్లో 82103 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా, జలాశయం నుంచి వివిధ కాలువలకు 221 క్యూసెక్కుల నీరు బయటకు వెళుతుంది. మొత్తంగా తుంగభద్ర జలాశయ నీటిమట్టం 1633 అడుగుల గాను, ప్రస్తుతం 1621.19 అడుగులుగా ఉంది. జలాశయం నీటి నిల్వలు 105.788 టీఎంసీలకు కాను.. 64.728 టీఎంసీల నీటి నిలువలు ఉన్నాయి. ఇదే సమయంలో గత ఏడాది తుంగభద్ర జలాశయానికి 4021 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా ఉండగా, 1610 అడుగులుగా నీటి నిల్వలు ఉండటం గమనార్హం.
Advertisement
తాజా వార్తలు
Advertisement