Friday, November 22, 2024

Mantralayam – ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైనికులుగా పని చేయాలి – ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

మంత్రాలయం, నవంబర్ 14,(ప్రభన్యూస్) :మంత్రాలయం గ్రామ అభివృద్ధి కి తమ వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో సచివాలయం-3 లో నిర్వహించిన ఏపీ వై నీడ్స్ జగన్ కార్యక్రమానికి టీటీడీ పాలకమండలి సభ్యులు వై. సీతారామిరెడ్డి తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా రాఘవేంద్ర సర్కిల్ లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులు జి. భీమారెడ్డి, ఇన్ చార్జ్ విశ్వనాథ్ రెడ్డి, సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీ లో వారు పాల్గొని రాఘవేంద్రపురం చేరుకున్నారు

.సచివాలయంలో ఏర్పాటు చేసిన వెల్ఫేర్ స్కీం డిస్ప్లే బోర్డ్ ను ఆవిష్కరించారు. రాఘవేంద్రపురం ప్రధాన రహదారి పై ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి మాట్లాడుతూ, రూ. 50 లక్షల తో రాఘవేంద్రపురం ప్రధాన రహదారి, కోటి యాభై లక్షలతో కాలనీల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. పెండింగ్ లో ఉన్న మిగతా రోడ్లను కూడా త్వరలోనే పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. .

ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసులు, ఎస్ఐలు వేణు గోపాల్ రాజ్, కిరణ్, మండల నాయకులు పెట్రోలు బంక్ శీనన్న, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, రాంపురం రెడ్డి సోదరుల అభిమానులు తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement