తుగ్గలి : మండల పరిధిలోని పగిడిరాయి గ్రామ సచివాలయంలో విద్యుత్ శాఖ జూనియర్ లైన్మెన్ (గ్రేడు2)గా పనిచేస్తున్న సింగరి రమేష్ (35) ఆదివారం రాత్రి కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు రమేష్ సొంత గ్రామం అమీనాబాద్ లో ఈనెల 1 వ తేదీన పాము కాటుకు గురికావడంతో కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి ఆదివారం రాత్రి చెందారు. మృతి చెందిన రమేష్ కు భార్య శ్యామల ఒక కూతురు ఒక కుమారుడు ఉన్నారు ఈ విషయంపై ఎస్ఐ మల్లికార్జున కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement