Thursday, November 21, 2024

శ్రీశైలంలో పోటెత్తిన భ‌క్త జ‌నం…శివ‌ నామ స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగుతున్న శ్రీగిరులు..

కర్నూలు: మ‌హాశివ‌రాత్రి సంద‌ర్భంగా ప్ర‌ముఖ శైవ‌ పుణ్యక్షేత్రం శ్రీశైలం భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ప‌ర్వ‌దినం కావ‌డంతో శ్రీగిరి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వేలాది మంది భ‌క్తులు పాద‌యాత్ర‌గా శ్రీగిరి క్షేత్రానికి చేరుకుంటున్నారు.. వేక‌వ‌ఝాము నుంచే స్వామిఅమ్మవార్ల దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను నేడు లక్షలాది మంది భక్తులు దర్శించుకోకున్నారు.. భ‌క్తుల ర‌ద్దీని దృష్టి ఉంచుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో ఇవాళ రాత్రి జాగారం జరుగనుంది. అర్ధరాత్రి పాగాలంకరణ అనంతరం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణం నిర్వహించనున్నారు. అటు పాతాళగంగలో భక్తుల పుణ్య‌స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

శ్రీశైలంలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సంధర్బంగా భద్రతా చర్యల దృష్ట్యా పార్కింగ్ స్ధలాలు, సిసి కెమెరాల కంట్రోల్ రూమ్ లను కర్నూలు జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప పరిశీలించారు. అనంతరం బ్రహ్మోత్సవాల భక్తుల కోసం ఏర్పాటు చేసిన టెంపుల్ క్యూలైన్లు పరిశీలించారు. అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జి. మదుసుధన్ రావు, ఆత్మకూరు డిఎస్పీ శృ తి ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement